![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. సీజన్ సెవెన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి అందరికి తెలిసిందే. సీజన్ సెవెన్ సూపర్ హిట్ అవ్వడంతో సీజన్ 8 ఎప్పుడు ఉండబోతుందా అనే క్యూరియాసిటి అందరిలోను ఉంది.
సాధారణంగా బిగ్ బాస్ సెప్టెంబరులో ఉంటుందని అనుకున్నారంతా.. కానీ ఈసారీ కాస్త మూడు నెలల ముందుగా అంటే జూలై రెండవ వారంలో గానీ చివరి వారంలో గానీ మొదలవుతుందంట. ఇందుకు గాను బిగ్ బాస్ సెట్ వర్క్ పనులు కూడా మొదలయ్యాయని టాక్. అయితే సారీ ఎందుకు ముందు ఉంటుందంటే. జూన్ నెల మొత్తం క్రికెట్ టీ20 వరల్డ్ కప్ ఉంది. అందువల్ల టీఆర్పీ ని దృష్టిలో పెట్టుకొని జూలైలో గ్రాంఢ్ గా లాంఛ్ చేయనున్నట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ సీజన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరుండే ఛాన్స్ ఉందో ఓసారి చూసేద్దాం.
ఇన్ స్ట్రాగ్రామ్ , ఫేస్ బుక్ , ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో పాపులర్ అయినటువంటి కొంతమంది సెలెబ్రిటీలని ఈ సారి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. బర్రెలక్క, ఫార్మర్ నేత్ర, కుమారీ ఆంటీలు కచ్చితంగా ఉంటారనే వార్తలు వినపిస్తున్నాయి. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయినటువంటి కిరాక్ ఆర్పీ కూడా బిగ్ బాస్ 8 లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక గత సీజన్ సెవెన్ కి చివరి నిమిషంలో రాలేకపోయిన కొంతమంది సెలెబ్రిటీలను కూడా బిబి టీమ్ అప్రోచ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక బిబి టీమ్ కంటెస్టెంట్స్ ఎంపికని శరవేగంగా చేస్తుందని, సెట్ వర్క్ కూడా సాగుతుందని తెలుస్తుంది. మరో రెండు నెలల్లో బిగ్ బాస్ ప్రారంభం అవుతుందని సమాచారం. మరి ఈ సీజన్ 8 లోకి ఎవరు వస్తే బాగుంటందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
![]() |
![]() |